How to take Gold loan and charges
Gold Loans: ఆర్థికంగా ఏదైనా అత్యవసరం పడిందంటే చాలా మంది ప్రస్తుతం గోల్డ్ లోన్ వైపే చూస్తున్నారు. క్షణాల్లో డబ్బులు రావడం, వడ్డీలు కూడా తక్కువగా ఉండటంతో గోల్డ్ లోన్ తీసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకులు కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా లోన్లు ఇస్తున్నాయి. కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా గోల్డ్ లోన్ ఇస్తాయి. అయితే ఆ సంస్థల్లో ఈఎంఐ పద్దతిలో అసలును సైతం కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ బ్యాంకుల్లో ఆ ఆప్షన్ ఉండదు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తూ అసలును ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒకేసారి మొత్తాన్ని కట్టలేక ప్రైవేటు రుణ సంస్థల్లో గోల్డ్ లోన్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాకట్టు రుణాలను ఈవీఎం నెలవారీ కిస్తీ పద్ధతిలో చెల్లించే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ రుణ మంజూరులో అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి దేశంలోని...